Posts

ఉల్లిపాయలు

ఆహా!!! నాకు చాలా ప్రియాతి ప్రియమైనది.. ఒకప్పుడు. కొన్ని వంటల్లో అది లేనిదే ముద్ద దిగేది కాదనుకోండి. కొన్ని కాలాల్లో దాని ధర అరవై లేదా వంద అయ్యేది. అయినా సరే, పట్టు వదలని విక్రమార్కురాలిలాగా, నాన్నా! కొందాం అని కొనిచ్చేదాన్ని. అప్పట్లో ఎవరితో అయినా దీని గురించి మాట్లాడితే, వంద రూపాయలైనా కొoటామండి అని చెప్పుకోవడమంటే అదో గొప్ప. (కాదు తిక్క) ఏవిటో opposite poles అట్ట్రాక్ట్ అని, మా పెళ్ళి అయ్యాక, మా అత్తగారింట్లో ఉల్లిపాయ అనే పదం అస్సలు వినపడకూడదు. ఎవ్వరిమాట వినడు సీతయ్య లా అనమాట. ఉల్లి, వెల్లుల్లి, గోంగూర, సొరకాయ , బీరకాయ ఇలా ఎన్నో మా అత్తగారింట్లో నిశిద్ధాలు. ఇలా కొన్ని ఇంట్లో ఉంటే, మా వారు సరే సరి, బంగాళాదుంప తప్ప వేరేవి ఏవీ ఆయన కళ్ళకి కనిపించి కనిపించవు. పెళ్లికి ముందు, పాట అంటే చెవులు కోస్కునట్టు వంట అంటే చేతులు కాల్చుకున్నా,  మరి చేసేదాన్ని. అంత ఇష్టం అనమాట! ఇప్పుడు ఇలా ఏం తినాలో, ఏం చెయ్యాలో తెలియని ఇదో స్థితి అయినా సరే, నేను మా వారు ఉద్యోగాల వల్ల వేరే ఊర్లో ఉన్నందుకు, ఒకసారి  నా గుండెల నిండా ధైర్యం నింపుకుని నాకోసం తెచ్చుకున్నాను చేద్దామని .(మా ఆయనకి తెలియకుండా) వివాహ భోజనంబు! వింత